ఐపీఎల్ 2020 : ఎవరు గెలిస్తే వారే...

ఐపీఎల్ 2020 : ఎవరు గెలిస్తే వారే...

ఐపీఎల్ 2020 లో ఎప్పుడో ప్లే ఆఫ్ రేస్ మొదలయింది. అయితే ఇప్పటికే టాప్ 4 స్థానాల్లో ముంబై, ఢిల్లీ, బెంగుళూర్ 14 పాయింట్లతో ప్లే ఆఫ్ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాయి. ఇక మిగిలిన ఆ ఒక్క స్థానం కోసం కోల్‌కత, పంజాబ్, హైదరాబాద్ మూడు జట్లు పోటీపడుతున్నాయి.

అయితే ఈ రోజు ఐపీఎల్ 2020 లో రెండో మ్యాచ్ పంజాబ్, హైదరాబాద్ మధ్య సాయంత్రం 
7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ లో వరుసగా మూడు విజయాలు సాధించి ఆత్మవిశ్వసం తో పంజాబ్ జట్టు ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌, నికోలస్ పూరన్ మరియు క్రిస్ గేల్ తో చాలాబలంగా కనిపిస్తుంది కింగ్స్. బౌలింగ్ లో కూడా మొహమ్మద్ షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాగే బ్యాటింగ్ లో అంత రాణించలేకపోతున్న గ్లెన్ మాక్స్వెల్ బౌలింగ్ లో వికెట్లు తీయడం జట్టుకు కలిసొచ్చే అంశం.

ఇక హైదరాబాద్ జట్టులో గత మ్యాచ్ లో మనీష్ పాండే(83) పరుగులు చేయడంజట్టుకు కలిసొస్తుంది. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ జట్టు బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో పై మాత్రమే ఉండేది. ఇక గత మ్యాచ్ లో గాయం కారణంగా తప్పుకున్న కేన్ విలియమ్సన్ జట్టులోకి వస్తే బ్యాటింగ్ కు మరింత బలం వచ్చినట్టే. బౌలింగ్ లో భువనేశ్వర్ లేకపోయిన రషీద్ ఖాన్, టి నటరాజన్ రాణిస్తున్నారు. గత మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన హోల్డర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసాడు. 

అయితే ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే వారి ప్లే ఆఫ్ అవకాశాలే సజీవంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఐపీఎల్ 2020 లో 10 మ్యాచ్ లు ఆడిన ఈ రెండు జట్లు 4 విజయాలు సాధించి 5,6 స్థానాల్లో ఉన్నాయి. ఈ రోజు కోల్‌కత-ఢిల్లీ మధ్య జరుగుతున్న మొదటి మ్యాచ్ లో కోల్‌కత ఓడిపోతే పంజాబ్, హైదరాబాద్ లో ఏ జట్టు విజయం సాధిస్తే వారు పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి వస్తారు.