నిలవాలంటే.. ఈరోజు గెలవాల్సిందే

నిలవాలంటే.. ఈరోజు గెలవాల్సిందే

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. మంగళవారం ఇక్కడ జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఢిల్లీ 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌ 8 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ లీగ్‌లో ఈ రెండు జట్లూ ఒక సారి తలపడగా ఢిల్లీపై 15 పరుగులు తేడాతో హైదరాబాద్‌ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ తహతహలాడుతోంది. నేడు జరిగే మ్యాచ్లో ఓడితే సన్ రైజర్స్ ఆఫ్ రేసు నుంచి అధికారికంగా ఔటైనట్టే... 

ఈరోజు మ్యాచ్ ఓడిన హైదరాబాద్ టీమ్ ప్లేఆఫ్ కు వెళ్లే అవకాశం ఉన్న.. అది జరిగే పరిస్థితులు కనిపించట్లేదు. ఆడబోయే మూడు మ్యాచ్‌లను హైదరాబాద్ ఖచ్చితంగా గెలవాలి. అంటే ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లను ఓడించాలి. అలాగే కోల్‌కతా, పంజాబ్ జట్లు తమ తదుపరి మ్యాచ్‌లు ఓడిపోతేనే హైదరాబాద్ ప్లేఆఫ్ కు చేరుకొనే ఛాన్స్ ఉంటుంది.