బీసీసీఐ కి షాక్... ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుండి 'వివో' ఔట్

బీసీసీఐ కి షాక్... ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుండి 'వివో'  ఔట్

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఆసియా కప్, టీ 20 ప్రపంచ కప్ వంటి రెండు మెగా టోర్నీలు వాయిదా తర్వాత అదే విండోలో జరుగుతుంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఈ లీగ్ జరగనున్నట్లు రెండు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో నిర్వహించారు. అయితే ఇదే సమావేశంలో ఐపీఎల్ స్పాన్సర్స్ విషయంలో ఎటువంటి మార్పు ఉండదని ఈ ఏడాది ఐపీఎల్ కు వివో నే స్పాన్సర్ గా కొనసాగుతుంది అని అధికారులు స్పష్టం చేసారు. ఈ విషయం పైనే భారత అభిమానులు బీసీసీఐ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. 

జూన్ లో భారత్-చైనా మధ్య లడఖ్ యొక్క గాల్వన్ లోయలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో 21 మంది భారతీయ సైనికులు అమరవీరులు అయ్యారు. అయితే అప్పటి నుండి ''బాయికాట్ చైనా'' అనే నినాదం భారత్ లో మారుమోగుతోంది. కానీ ఐపీఎల్ కు ''వివో'' అనే ఒక చైనా ఫోన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ స్పాన్సర్షిప్ చేస్తుంది. అందువల్ల ఆ స్పాన్సర్షిప్ ను తొలగించాలంటూ ప్రజలు బీసీసీఐ ని కోరారు. కానీ బీసీసీఐ మాత్రం వివో నే తమ స్పాన్సర్ చెప్పింది. 

ఇక అప్పటి నుండి భారత ప్రజలు బాయికాట్ చైనా అనే నినాదాన్ని వదిలేసి బాయికాట్ ఐపీఎల్ అనే నినాదాన్ని అందుకున్నారు. బీసీసీఐ కి దేశంతో కంటే డబ్బే ముఖ్యం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది కేవలం ఒక వ్యాపారం మాత్రమే, మిమ్మల్ని చూసి సిగ్గు పడుతున్నాము అని ట్విట్టర్ లో బీసీసీఐ ని ఏకిపారేస్తున్నారు. కానీ ఈ రోజు అనూహ్యంగా వివో బీసీసీఐ కి షాక్ ఇచ్చే విధంగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది. 2022 వరకు ఐపీఎల్ కు స్పాన్సర్ షిప్ హక్కులను కలిగి ఉన్న వివో ఈ ఏడాదే అందులో నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. దాంతో వచ్చే నెలలో జరగనున్న ఐపీఎల్ కోసం బీసీసీఐ కొత్త స్పాన్సర్స్ ను వెతకడం ప్రారంభించింది.