రేపే బిగ్గెస్ట్‌ టీ20 క్రికెట్‌ లీగ్‌ ప్రారంభం...

రేపే బిగ్గెస్ట్‌ టీ20 క్రికెట్‌ లీగ్‌ ప్రారంభం...

పొట్టి క్రికెట్‌ ఫైట్‌కి అంతా సిద్ధమైంది. రేపటి నుంచి బిగ్గెస్ట్‌ టీ ట్వంటీ క్రికెట్‌ లీగ్‌ ప్రారంభం కానుంది. ఎవరి మంత్రా గెలుస్తుందో చూద్దామంటూ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్‌ తలపడుతున్నాయ్‌. దీంతో ఇకనుంచి ఐపీఎల్‌ జోరు కనిపించనుంది..!

ఇలా ఓవరాల్‌ క్రికెట్‌ ఎక్స్‌పీరియన్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ ఐపీఎల్‌. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కి అంతా సిద్దమైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా దుబాయ్‌లో జరిగింది ఐపీఎల్‌ సీజన్‌. అయితే ఈసారి మాత్రం సొంత గడ్డపై జరుగుతున్నా..  అభిమానుల కోలాహలం ఈసారికి కనిపించదు. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరగనున్నాయ్‌. అటు కేవలం కొన్ని వేదికలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కరోనా బారినపడకుండా బయోబబుల్‌లో ఆటగాళ్లను ఉంచారు. అంతకు ముందు ఏడు రోజుల క్వారంటైన్‌ కూడా ముగిసింది. దీంతో జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు గ్రౌండ్‌లోకి దిగుతున్నారు. ఐపీఎల్‌లో ఆడేందుకు ఆయా దేశాల ఆటగాళ్లు కూడా ఇండియా వచ్చేశారు. ఆఖరికి క్రికెట్‌ బోర్డులే తమ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడాలంటూ పంపిస్తున్నాయంటే.. దీని క్రేజెంతో తెలుసుకోవచ్చు. 

శుక్రవారం ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్‌ మధ్య జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు సన్నద్ధమయ్యాయి. ఎవరి మంత్రా గెలుస్తుంది..? అంటూ హోరెత్తిస్తున్నారు. మోరిస్‌, మ్యాక్సీలను అత్యధిక ధరకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ.. ఈసారి కప్‌ నమదే అంటోంది. అటు ముంబై ఇండియన్స్‌ మాత్రం ఆల్‌టైమ్‌ టాప్‌ టీమ్‌..! మరోసారి కప్పు కొడుతామని హిట్‌మ్యాన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 

శుక్రవారం నుంచి మే 30 వరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయ్‌. ఇక సన్‌రైజర్‌ హైదరాబాద్‌ కూడా స్ట్రాంగ్‌ టీమ్‌గా కనిపిస్తోంది. ఏప్రిల్‌ 11న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ ఐపీఎల్‌లో ఏకంగా నలుగురు వికెట్‌ కీపర్లు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ధోని సీఎస్‌కే కెప్టెన్‌గా ఉంటే.. రాజస్థాన్‌ రాయల్స్‌ సారధిగా సంజూ శాంసన్‌, ఢిల్లీ నాయకుడిగా పంత్‌, పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌లు వ్యవహరిస్తున్నారు. మొత్తంగా పొట్టి క్రికెట్‌ పండగ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.