రసెల్‌ మెరిసినా.. ఆర్‌సీబీదే విక్టరీ

రసెల్‌ మెరిసినా.. ఆర్‌సీబీదే విక్టరీ

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విజయానికి 10 పరుగుల దూరంలో ఆగిపోయింది. 214 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన నైట్‌రైడర్స్‌.. ఇన్నింగ్స్‌ చివరికి 203 పరుగులే చేసింది. నితీశ్‌ రాణా (46 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 85 నాటౌట్‌), రసెల్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 65) వీరోచిత పోరాటం చేసినా విజయాన్ని అందించలేకపోయారు. 

తొలి ఓవర్‌లోనే డేల్‌ స్టెయిన్‌.. లిన్‌(1)ను తొలి  పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత వెనువెంటనే నరైన్‌, గిల్‌ అవుటవడంతో 33/3 స్కోరుతో కష్టాల్లో పడింది. భారీ లక్ష్యం కళ్లముందున్నా.. సీనియార్‌ ప్లేయర్‌ ఊతప్ప.. 20 బంతుల్లో 9 పరుగులే చేయడం ఫలితంపై ప్రభావం చూపింది. ఆ తర్వాత రాణాతో జతకట్టిన రసెల్‌.. బౌలర్లను ఊచకోత కోశాడు. చాహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో అతడు హ్యాట్రిక్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో రాణా కూడా చెలరేగడంతో.. టార్గెట్‌ 24 బంతుల్లో 76కి వచ్చింది. ఆఖరి ఓవర్‌లో 24 పరుగులు కావాల్సి ఉండగా  మూడో బంతికి రసెల్‌ సిక్సర్‌ కొట్టినా ఐదో బంతికి రనౌట్‌ అవడంతో ఓటమి ఖాయమైంది. 

అంతకముందు.. టాస్ గెలిచిన కోల్ కత్తా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (110, 58 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సులు) వీరవిహారం చేశాడు. కోహ్లీకి మొయిన్ అలీ (66 పరుగులు, 28 బంతుల్లో, 5 ఫోర్లు, 6 సిక్సులు ) చక్కటి సహకారం అందించాడు. అనంతరం కుల్దీప్ యాదవ్ బౌలింగ్ పరిశిద్ చేతికి చిక్కాడు. ఓపెనర్ పార్థీవ్ పటేల్ (11 పరుగులు, 11 బంతులు, 2 ఫోర్లు) నరేన్ బౌలింగ్ లో నితీష్ రానాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో బ్యాట్స్ మెన్ అక్షదీప్ నాథ్ (13 పరుగులు, 15 బంతుల్లో, 1 సిక్స్ ) రసెల్ బౌలింగ్ లో ఉతప్పకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కోల్ కత్తా బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్, అండ్రూ రసెల్ తలో వికెట్ తీసుకున్నారు.