ఒక్క పరుగుతో ఓడిన చెన్నై

ఒక్క పరుగుతో ఓడిన చెన్నై

ఈ ఏడాది ఐపీఎల్‌లో బెంగళూరుకు తొలిసారి అదృష్టం కలిసి వచ్చింది. ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. ధోనీ(84, 48 బంతుల్లో 5x4, 7x6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో చివరి బంతివరకూ పోరాడినా ఒక్క పరుగుతో ఓడిపోయింది. 161 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసింది. 
తొలుత బ్యాటింగ్‌ చైని బెంగళూరు జట్టు.. కెప్టెన్‌ కోహ్లీ(9) తక్కువ స్కోరుకే ఔటైనా మరో ఓపెనర్‌ పార్థివ్‌పటేల్‌ (53, 37 బంతుల్లో 2x4, 4x6) రాణించాడు. ఏబీ డివిలియర్స్‌(25), అక్ష్‌దీప్‌నాథ్‌(24), మార్కస్‌స్టోయినిస్‌(14) ఫర్వాలేదని పించారు. చివర్లో మొయిన్‌ అలీ(26, 16 బంతుల్లో 5x4) ఫోర్లతో విరుచుకుపడడంతో 160 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, జడేజా, బ్రావో రెండేసి వికెట్లు తీయగా ఇమ్రాన్‌ తాహిర్‌ ఒక వికెట్‌ తీశాడు. 

లక్ష్యఛేదనలో చెన్నై బ్యాట్స్‌మెన్‌ తడపడ్డారు. వాట్సన్‌ (5), డు ప్లెసిస్‌ (5), రైనా (0), జాదవ్‌ (9) తక్కువ స్కోర్లకే వెనుదిరిగడంతో 28 పరుగులకే 4 కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాయుడు, ధోని ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. ఉమేశ్‌ బౌలింగ్‌లో 6, 4తో చెలరేగిన రాయుడును చహల్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత జడేజా, బ్రేవో (5) పెవిలియన్‌ చేరినా... ధోని చివరి వరకు పోరాడాడు.  చివరి ఓవర్‌లో 24 పరుగులు అవసరం కాగా ధోనీ 3 సిక్సులు, 1 ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేశాడు. చివరి బంతికి 2 పరుగులు అవసరమవ్వాల్సిన స్థితిలో పార్థివ్‌ పటేల్‌ ఠాకుర్‌ని రనౌట్‌ చేయడంతో బెంగళూరు విజయం సాధించింది.