టాస్ గెలిచిన ఢిల్లీ: ధోనీ ఈజ్ బ్యాక్

టాస్ గెలిచిన ఢిల్లీ: ధోనీ ఈజ్ బ్యాక్

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్‌ గెలిచింది. ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఆడని చెన్నై కెప్టెన్‌ ధోనీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. ధోనీతోపాటు డూప్లెసిస్‌, జడేజాలకు చోటు లభించింది. ఢిల్లీ జట్టులో రబాడ, ఇషాంత్‌ స్థానాల్లో బౌల్ట్‌, సుచిత్‌లకు అవకాశం దక్కింది. టోర్నీలో టాప్‌ 2 స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌ ఒక విధంగా నామమాత్రమేనని చెప్పొచ్చు.