ఐపీఎల్ స్కాం: 9 మంది పేర్లు బయటపెట్టండి

ఐపీఎల్ స్కాం: 9 మంది పేర్లు బయటపెట్టండి

2013లో ఐపీఎల్ ను స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం ఓ కుదుపునకు గురిచేసింది. ఈ ఫిక్సింగ్ లో ఇరుక్కుని ఐపీఎల్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండేళ్లు నిషేదానికి కూడా గురయ్యాయి. 2014లో జస్టిస్ ముద్గల్ కమిటీ ఐపీఎల్ స్కాంలోని 13 మంది పేర్లను సుప్రీం కోర్ట్ కు సమర్పించింది. అయితే అందులో కేవలం నలుగురి పేర్లను మాత్రమే సుప్రీం కోర్ట్ వెలువరించింది. రాజస్థాన్ రాయల్స్ కో ఓనర్ రాజ్ కుంద్రా, చెన్నై ఓనర్ గురునాథ్ మయప్పన్ లను  మాత్రమే దోషులుగా తేల్చింది. మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్, ఐపీఎల్ కో ఓనర్ సుందర్ రామన్ లను నిర్దోషులుగా తేల్చింది. అయితే మిగితా 9 మంది క్రికెటర్ల పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో 9 మంది క్రికెటర్ల పేర్లను  బహిర్గతం చేయాలని సీఓఏ.. సుప్రీం కోర్ట్ ను కోరింది.