పంత్‌ పంచ్‌.. రాజస్థాన్‌ చిత్తు

పంత్‌ పంచ్‌.. రాజస్థాన్‌ చిత్తు

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. యువ సంచలన ఆటగాడు రిషభ్‌ పంత్‌ (78 నాటౌట్‌; 36 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో ఆరు వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రహానే(105 నాటౌట్‌; 63 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు), స్మిత్‌ (50; 32 బంతుల్లో 8ఫోర్లు)లు రాణించారు. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ అలవోకగా ఛేదించింది. ధావన్‌(54) హాఫ్‌ సెంచరీ చేయగా.. పృథ్వీ షా(42) రాణించాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.