హైదరాబాద్‌లో ఐపీఎల్‌-12 ఫైనల్‌ 

 హైదరాబాద్‌లో ఐపీఎల్‌-12 ఫైనల్‌ 

హైదరాబాద్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌. ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్స్‌ భాగ్యనగరంలో జరగనుంది. షెడ్యూల్‌ ప్రకారం మే 12న చెన్నైలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానానికి తరలించారు. చిదంబరం స్టేడియంలో ఖాళీగా ఉన్న మూడు స్టాండ్స్‌ను తెరిపించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావడంలో తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) విఫలమైంది. దీంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. క్వాలిఫయర్‌ -1 మాత్రం చెన్నైలోనే జరుగుతుంది. మే8న జరిగే ఎలిమినేటర్‌, 10న జరిగే క్వాలిఫయర్‌ మ్యాచ్‌లను విశాఖపట్నానికి తరలించారు. గతంలోనూ ఇలా వేరే వేదికల్లో సమస్యలు, ఇతర కారణాలతో విశాఖ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది.