ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి షాక్‌

ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి షాక్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ 2019ను విక్టరీతో మొదలుపెట్టింది. చెపాక్‌ స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు బ్యాట్స్‌మెన్‌ చేతులేత్తేశారు. 17.1 ఓవరల్లో కేవలం 70 పరుగులకే ఆ జట్టు ఆలౌటైంది. బ్యాట్స్‌మెన్‌ అంతా అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌ ఒక్కడే రెండంకెల స్కోరు చేయగలిగాడు. కెప్టెన్‌ కోహ్లీతోసహా అందరూ విఫలమయ్యారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో హర్భజన్ సింగ్‌, ఇమ్రాన్‌ తాహిర్‌ చెరో మూడు వికెట్లు, జడేజా 2, బ్రావో 1 వికెట్‌ తీశారు. ఆర్‌సీబీ జట్టులో పార్థివ్‌ 29 పరుగులు, డివిలియర్స్‌ 9 పరుగులు చేశారు.

71 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన చెన్నై  17.4 ఓవర్లలో 3 వికెట్లకు 71 పరుగులు చేసి గెలిచింది. రాయుడు (29), రైనా (19) రాణించారు. హర్భజన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 2015 తర్వాత తొలిసారిగా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హర్భజన్‌ నిలిచాడు.