'వివో' పోవడంతో ఫ్రాంఛైజీలకు ఎంత  నష్టమో తెలుసా...?

'వివో' పోవడంతో ఫ్రాంఛైజీలకు ఎంత  నష్టమో తెలుసా...?

ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ గా వివో తన హక్కుల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయం పై స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... ఈ కారణంగా బీసీసీఐ కి ఎటువంటి నష్టం లేదు అని ప్రకటించాడు. మొత్తం 5 సంవత్సరాలకు గాను 2,190 కోట్ల రూపాయలు, అంటే సంవత్సరానికి సుమారు 440 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్న వివో తప్పుకోవడంతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు మాత్రం నష్టమే అని చెప్పాలి. ఎందుకంటే వివో ఏటా చెల్లించే 440 కోట్లు ఐపీఎల్ యొక్క వాణిజ్య ఆదాయంలో ముఖ్యమైన భాగం, అందులో నుండి ఎనిమిది ఫ్రాంచైజీలకు, ఒక్కోదానికి 20 కోట్ల వరకు వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చే సంస్థలు వివో అంత చెల్లించేందుకు సిద్ధంగా లేవు. దానికి కారణం కరోనా. ఈ వైరస్ కారణంగా అభిమానులు మ్యాచ్ లకు వచ్చే అవకాశం పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి ఇప్పుడు స్పాన్సర్ గా ఉండటానికి వస్తున్న సంస్థలు అన్ని వివో చెల్లించిన దానిలో సగం మాత్రమే చెల్లించి స్పాన్సర్ షిప్ హక్కులను కొట్టేయాలని చూస్తున్నాయి. అలా జరిగితే ఫ్రాంచైజీలకు వచ్చే 20 కోట్లలో 10 కోట్లు మాత్రమే వస్తాయి. ఇది వారికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అలాగే ఈ ఏడాది ఆటగాళ్లను సురక్షితంగా చూసుకునే బాధ్యత కూడా ఫ్రాంచైజీల పైనే ఉంది.