రాబిన్ ఊతప్పకు షాక్‌

రాబిన్ ఊతప్పకు షాక్‌

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌ సన్‌ రైజర్స, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జట్టు కెప్టెన్‌ విలియమ్సన్‌  టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 3 మార్పులతో బరిలోకి దిగుతోంది. సినియర్‌ రాబిన్‌ ఉతప్పతోపాటు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణను పక్కనబెట్టి.. రింకూ సింగ్‌, కరియప్ప, ఆంధ్రా ఆటగాడు పృథ్వీ రాజ్‌కు చోటు కల్పించారు. సన్ రైజర్స్ జట్టులో మార్పులేమీ లేవు.