ఐపీఎల్‌లో గుంటూరు కుర్రాడు అరంగేట్రం..

ఐపీఎల్‌లో గుంటూరు కుర్రాడు అరంగేట్రం..

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో ఇవాళ జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులో తెలుగు తేజం పృథ్వీరాజ్‌కు చోటు దక్కింది. గత మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చిన ప్రసిద్ధ్‌ కృష్ణ స్థానంలో పృథ్వీకి అవకాశం దక్కింది. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన 19 ఏళ్ల పృథ్వీరాజ్ రంజీల్లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లెఫ్టార్మ్‌ మీడియం పేసర్‌గా సత్తాచాటుతున్న పృథ్వీని.. ఐపీఎల్ వేలంలో కనీస ధర రూ.20 లక్షలకు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసింది.