ఐపీఎల్‌: సన్‌రైజర్స్‌ టార్గెట్‌ ఎంతంటే..

ఐపీఎల్‌: సన్‌రైజర్స్‌ టార్గెట్‌ ఎంతంటే..

ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్‌ లిన్‌ 51 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ జట్టులో ఓపెనర్‌ నరైన్‌ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 8 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన నరైన అవుటయ్యాక స్కోరు ఒక్కసారిగా నెమ్మదించింది. నరైన్‌ అవుటైన కాసేపటికే శుభ్‌మన్‌ గిల్ (3), నితీశ్ రాణా (11) పెవిలియన్‌ చేరారు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (6) రనౌటవడంతో క్రీజ్‌లోకి వచ్చిన రింకూ సింగ్‌ భారీ షాట్లు కొట్టాడు. 25 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన రింకూ.. సిందీప్‌ శర్మ బౌలింగ్‌లో అవుటాయ్యాడు. ఈ దశలో లిన్‌కు జతకలిసిన ఆండ్రూ రసెల్‌(15).. వరుసగా రెండు సిక్సర్లు కొట్టినా చివరి బంతికి బౌండరీ దగ్గర ఫీల్డర్‌కు చిక్కాడు. చివరి ఓవర్లో కరియప్ప ఓ సిక్స్‌ కోట్టడంతో కేకేఆర్‌ 159 పరుగులు చేయగలిగింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 3.. భువనేశ్వర్‌ 2.. రషీద్‌ఖాన్‌, సందీప్‌శర్మ చెరో వికెట్‌ తీశారు.