ఐపీఎల్‌: టాస్‌ గెలిచిన ముంబై

ఐపీఎల్‌: టాస్‌ గెలిచిన ముంబై

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ముంబైలోని వాంఖడె స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్‌ గెలిచింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇరు జట్లకూ కీలకమైన ఈ మ్యాచ్‌లో మార్పులేమీ లేకుండానే ముంబై జట్టు బరిలోకి దిగుతోంది. డేవిడ్‌ వార్నర్‌ స్వదేశానికి వెళ్లిపోవడంతో అతని స్థానంలో గప్టిల్‌కు సన్‌రైజర్స్‌ జట్టులో చోటు దక్కింది. సందీప్‌శర్మ స్థానంలో థంపికి అవకాశం వచ్చింది.