ముగిసిన ముంబై బ్యాటింగ్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఇదీ..

ముగిసిన ముంబై బ్యాటింగ్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఇదీ..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.  58 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 69 పరుగులు చేసి డికాక్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టాస్‌ గెలిచి ముంబై జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (24) ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సూర్యకుమార్‌(23), ఎవిన్‌లెవిస్‌(1) హార్దిక్‌ పాండ్య (11), పొలార్డ్‌ (10) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా మరో ఎండ్‌లో డికాక్‌ ఒంటరి పోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. రైజర్స్ బౌలింగ్‌లో ఖలీల్ 3, నబీ, భువనేశ్వర్ తలో వికెట్ తీశారు.