రాణించిన పాండ్య బ్రదర్స్‌.. ఢిల్లీ టార్గెట్‌ ఇదీ..

రాణించిన పాండ్య బ్రదర్స్‌.. ఢిల్లీ టార్గెట్‌ ఇదీ..

ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ(30), క్వింటన్‌ డికాక్‌(35) దూకుడుగా ఆడి శుభారంభాన్ని అందించారు. రోహిత్‌శర్మ, డికాక్‌, సూర్యకుమార్‌ వెనువెంటనే అవుటవడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో హార్దిక్‌ పాండ్య 32 పరుగులు (3సిక్స్‌లు, 2 ఫోర్లు), క్రూనల్ పాండ్య 37 పరుగులు (5 ఫోర్లు) ఆదుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో రబడకు 2 వికెట్లు, అమిత్ మిశ్రా, అక్సర్ పటేల్‌కు తలో వికెట్ దక్కింది.