ముంబై చేతిలో ఢిల్లీ చిత్తు

ముంబై చేతిలో ఢిల్లీ చిత్తు

ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలి బ్యాటింగ్‌ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

ఓపెనర్లు రోహిత్‌శర్మ(30), క్వింటన్‌ డికాక్‌(35) దూకుడుగా ఆడి శుభారంభాన్ని అందించారు. రోహిత్‌శర్మ, డికాక్‌, సూర్యకుమార్‌ వెనువెంటనే అవుటవడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో హార్దిక్‌ పాండ్య 32 పరుగులు (3సిక్స్‌లు, 2 ఫోర్లు), క్రూనల్ పాండ్య 37 పరుగులు (5 ఫోర్లు) ఆదుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో రబడకు 2 వికెట్లు, అమిత్ మిశ్రా, అక్సర్ పటేల్‌కు తలో వికెట్ దక్కింది.

169 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్ ధావన్ 35, అక్షర్ పటేల్ 26 పరుగులు చేశారు.