దుబాయ్ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న ఆటగాళ్లు...

దుబాయ్ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న ఆటగాళ్లు...

యూఏఈ వాతావరణంలో ఆడటం అంత ఈజీ కాదా.. వేడి వాతావరణం విదేశీ ప్లేయర్స్‌తో ఆటగాళ్లుకు చుక్కలు చూపిస్తోందా.. అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఐపీఎల్‌ టీమ్స్‌కి ఇప్పుడు యూఏఈ వాతావరణం పెద్ద ఛాలెంజ్‌గా మారింది. మ్యాచ్ సమయంలో ప్లేయర్స్‌కు చెమటలు బాగా పడుతున్నాయ్‌. ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తుంది యూఏఈ వాతావరణం. దాంతో ఇక్కడ సుదీర్ఘ సమయం ఆడటం ఈజీ కాదంటున్నారు  ప్లేయర్స్‌. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ లాంటి దేశాల నుంచి ఐపీఎల్‌ కోసం భారత్‌కు వచ్చే ఆటగాళ్లు.. మన వాతావరణానికే అల్లాడిపోతుంటారు. మరి ఇప్పుడు ఐపీఎల్‌ జరుగుతోంది యూఏఈలో. అక్కడ రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు 35-40 డిగ్రీల మధ్య ఉంటాయి. రాత్రి పది గంటలకు కూడా వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నుట్లు విదేశీ ఆటగాళ్లు వాపోతున్నారు.  

అయితే మధ్యాహ్నం మ్యాచ్‌లు తక్కువే అయినా.. అవి సవాలు విసురుతున్నాయ్‌. రాత్రి మ్యాచ్‌ల్లోనూ ఉక్కపోతతో ఆటగాళ్లు ఇబ్బంది పడటం ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతోంది. సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడటం ఇక్కడ సులభమేమీ కాదు. ఇలాంటి వాతావరణంలో ఎక్కువసేపు ఆడాలంటే శక్తినంతా ఖర్చుచేయాల్సిందే. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ ప్లేయర్స్‌కు మాత్రం యూఏఈ వాతావరణం చుక్కలు చూపిస్తోంది. శీతల వాతావరణంలో ఆడిన ఆ దేశ ఆటగాళ్లు తీవ్ర ఉక్కపోతకు భయపడుతున్నారు. ఇంత వేడిలో మ్యాచ్‌లు ఆడటం కష్టంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.