ఐపీఎల్‌: టాస్‌ గెలిచిన పంజాబ్‌

ఐపీఎల్‌: టాస్‌ గెలిచిన పంజాబ్‌

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇవాళ తలపడుతున్నాయి. చిన్నస్వామి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లను గెలిచిన ఆర్‌సీబీ.. ఈ మ్యాచ్‌తోపాటు మరో మ్యాచ్‌ను గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక.. ఈ మ్యాచ్‌లో ఓడితే మిగతా మూడు మ్యాచులు తప్పక గెలిస్తేనే పంజాబ్‌ ప్లేఆఫ్‌ చేరుకుంటుంది. అందుకే.. రెండు జట్లకూ ఈ మ్యాచ్‌ కీలకమే..