ఐపీఎల్-12: నేడు మరో రసవత్తర పోరు

ఐపీఎల్-12: నేడు మరో రసవత్తర పోరు

ఐపీఎల్-12 టైటిల్ ఫైనల్ లో ముంబయిని ఢీకొట్టే జట్టేదే నేడు తేలిపోనుంది. విశాఖ ఏసీఏ-వీడీసీఏ మైదానం వేదికగా జరిగే క్వాలిఫైయన్-2 మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. లీగ్ చరిత్రలో తొలిసారి నాకౌట్ దశలో మ్యాచ్ గెలిచిన ఊపులో ఉన్న ఢిల్లీ అదే జోరులో తుది పోరాటానికి అర్హత సాధించాలని తహతహలాడుతోంది. గత రెండు మ్యాచ్ ల్లో ఎదురైన పరాజయాల నుంచి తేరుకుని ఫైనల్ చేరాలని చెన్నై పట్టుదలగా ఉంది.