ఐపీఎల్‌: ధోనీ ఈజ్ బ్యాక్

ఐపీఎల్‌: ధోనీ ఈజ్ బ్యాక్

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఆడని ధోనీ.. ఇవాళ పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న బ్రావో కూడా చెన్నై జట్టులో చోటు దక్కించుకున్నాడు. బెంగళూరు జట్టు రెండు మార్పలతో బరిలోకి దిగుతోంది. ఏబీ డివిలియర్స్‌తోపాటు ఉమేష్‌ యాదవ్‌కు అవకాశం దక్కింది.