పంజాబ్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్‌

పంజాబ్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్‌

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్‌ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. వార్నర్‌ 81 పరుగులో వీరవిహారం చేశాడు. సాహా(28), మనీష్ పాండే(36) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో షమీ 2, రహమాన్ 2, అశ్విన్ 1, అర్షదీప్ సింగ్ 1 వికెట్ తీశారు.
213 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బ్యాట్స్‌మన్‌లో కేఎల్ రాహుల్ (79) మినహా ఎవరూ రాణించలేదు. గేల్ 4 స్వల్ప స్కోరుకు వెనుదిరిగాడు. అగర్వాల్ 27, పూరన్ 21, మిల్లర్ 11 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో అహ్మద్ 3 వికెట్లు, రషిద్ ఖాన్ 3, సందీప్ శర్మ రెండు వికెట్లు తీశారు.