పనికట్టుకుని పరువు తీసుకుంటున్న ఐపీఎల్ జట్లు...

పనికట్టుకుని పరువు తీసుకుంటున్న ఐపీఎల్ జట్లు...

కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు రెండు జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇందులో ఆసీస్ టాప్ ఆర్డర్ రెచ్చిపోవడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 374 పరుగులు చేసింది. అయితే మన ఐపీఎల్ లో ఆసీస్ ఆటగాళ్లు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తారో అందరికీ తెలుసు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో మాత్రం మ్యాక్స్వెల్, స్మిత్, ఫించ్ వంటి ఆటగాళ్లు విఫలమయ్యారు.కానీ ఈ రోజు జరిగిన మ్యాచ్ లో   ఫించ్, స్మిత్ సెంచరీలతో రెచ్చిపోగా మ్యాక్స్వెల్ 19 బంతుల్లో 3 సిక్స్ లతో 45 పరుగులు చేసాడు. ఈ సందర్భంగా ఐపీఎల్ జట్లలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ తమ ట్విట్టర్ లో '' మ్యాక్స్వెల్ సిక్సులు కొడుతున్నాడు అని వెక్కిరిస్తున్న ఎమోజితో  అతని జట్టు అయిన పంజాబ్ ను ట్యాగ్ చేసింది. దానికి రిప్లై గా ''స్మిత్ 66 బంతుల్లో సెంచరీ చేసాడు అని నవ్వుతున్న ఎమోజితో  పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ లకు ప్రజలు విపరీతంగా రియాక్ట్ కావడంతో పంజాబ్ ట్రేండింగ్ లోకి వచ్చింది.