ఐపీఎల్ టికెట్ల కోసం అభిమానుల పడిగాపులు

ఐపీఎల్ టికెట్ల కోసం అభిమానుల పడిగాపులు

కాసేపట్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్-12 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లుగా పేరుగాంచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ టైటిల్‌ కోసం హోరాహోరీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఈ ఆదివారం.. క్రికెట్‌ ప్రపంచమంతా హైదరాబాద్‌వైపే దృష్టి పెట్టింది. మరోవైపు క్రికెట్ అభిమానులు అన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న క్రికెట్ అభిమానులకు ఇప్పటి వరకు టికెట్లు అందలేదు. దీనికోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. హెచ్ సీఏ అధికారులు కాంప్టిమెంటరీ టికెట్లను కూడా బ్లాక్ లో అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. 

ఇదిలాఉంటే  300 ఐపీఎల్‌ టికెట్లు కావాలంటూ మేడ్చల్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఐపీఎల్‌ నిర్వాహకులకు లేఖ రాశారు. ఉన్నతాధికారులకు టికెట్లు కావాలని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అధికారికంగా లేఖ రాయడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఆ అధికారికి మెమో ఇచ్చి వివరణ కోరుతామని ఉన్నతాధికారులు అన్నారు.