విశాఖలో ఐపీఎల్‌.. ఇవాళ్టి నుంచే టికెట్ల విక్రయం 

విశాఖలో ఐపీఎల్‌.. ఇవాళ్టి నుంచే టికెట్ల విక్రయం 

విశాఖపట్నంలో ఐపీఎల్‌ సందడి మొదలైంది. నగర శివార్లలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈ నెల మే 8న ఎలిమినేటర్ మ్యాచ్, మే 10న క్వాలిఫయర్ మ్యాచ్ విశాఖలో జరగనున్నాయి. టికెట్లు ఇవాళ నుంచి విక్రయించనున్నారు. రూ.500, రూ.1000, రూ.1500, రూ.1750, రూ.3500, రూ.7500 (హాస్పటాలిటీ) టికెట్లతోపాటు కార్పొరేట్‌ బాక్సుకు సంబంధించి రూ.9000, రూ.5000 ధరల్లో టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా విక్రియస్తారు. ఆయా ఫ్రాంఛైజీలు, ఈవెంట్స్‌ నౌ వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. చివరిసారిగా 2016లో విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతుండడంతో విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.