దేవుని పాదాల చెంత ఐపీఎల్ ట్రోఫీ
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీని నాలుగో సారి గెలిచింది. ఈ గెలుపు వెనుక ఆటగాళ్ల కృషితోపాటు కోచింగ్ స్టాఫ్ సపోర్ట్ ఉంది. టీమ్ ఓనర్స్ అంబానీ కుటుంబం కూడా ప్రతి మ్యాచ్‌కూ హాజరై ప్లేయర్స్‌ను ఎంకరేజ్ చేసింది. చాలా మ్యాచ్‌లను జట్టు సహాధ్యక్షురాలు నీతా అంబానీ వీక్షించారు. ఇక.. ఫైనల్స్ మ్యాచ్‌లో కూడా చివర్లో ఆమె ప్రార్థనలు చేయడం కనిపించింది. హైదరాబాదలో జరిగిన ఈ మ్యాచ్ గ్యాప్‌లోనే ఆమె బల్కంపేటలోని ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రోహిత్ సేన విజేతగా నిలిచాక ఆటగాళ్లంతా ముంబై వెళ్లి అంబానీ కుటుంబసభ్యులకు ట్రోఫీని అందజేశారు. ఆమె ఆ ట్రోఫీని తమ పూజ గదిలోకి తీసుకెళ్లి దేవుడి పాదాల చెంత ఉంచారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
???????????? #OneFamily pic.twitter.com/1Dq0K09U2S
— Mumbai Indians (@mipaltan) May 14, 2019
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)