ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన సర్కార్..

ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన సర్కార్..

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. గవర్నర్‌ నరసింహన్‌ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం తక్షణమే అమల్లోకి రానుంది. గతంలో ఇంటలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు... సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్.. పోలీస్ హెడ్ క్వార్టర్సుకు అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో జరిగిన ఈ పరిణామం ఏపీ సర్కార్ వర్సెస్ ఎన్నికల సంఘంగా మారింది.