తగ్గని ఏబీ వెంకటేశ్వరరావు..! కేశినేని నానికి గట్టి కౌంటర్..!

తగ్గని ఏబీ వెంకటేశ్వరరావు..! కేశినేని నానికి గట్టి కౌంటర్..!

సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ వ్యవహారం ఏపీలో కాకరేపుతోంది... సస్పెన్షన్‌ను లైట్‌గా తీసుకున్న ఏబీ.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటుండగా.. మరోవైపు దీనిపై టీడీపీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కక్షసాధింపులో భాగంగానే సస్పెండ్ చేశారని కొందరు టీడీపీ నేతలు విమర్శిస్తుంటే.. దానికి భిన్నంగా స్పందించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.. "మీరు సీఎం అవ్వటానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి, టీడీపీ ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే.. సస్పెండ్ చేశారేంటి జగన్‌ గారూ!" అంటూ ట్వీట్ చేశారు నాని. అయితే, అదే స్థాయిలో కేశినేనికి కౌంటర్ ఇచ్చారు ఏబీ వెంకటేశ్వరరావు "ఏమిటోనండీ ఎంపీ గారూ! మీరేమో ఇలా అంటారు. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబు గారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారు..'' అని ఓ ట్వీట్ చేసిన ఏబీ.. ఆ తర్వాత "మీరు మీరు పార్లమెంట్‌లో కలసి మెలసే ఉంటారుగా! అందరూ కలసి ఒక అభిప్రాయానికి రండి - నేను వృత్తి ధర్మం నిర్వర్తించానో లేక ఇంకేమైనా చేసానో. నాక్కూడా కొంచెం క్లారిటీ వస్తుంది" అంటూ కేశినేనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.