బికినీలో అదరగొడుతున్న స్టార్ హీరో కూతురు

బికినీలో అదరగొడుతున్న స్టార్ హీరో కూతురు

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. రీసెంట్‌గా తన మానసిక సమస్యలు, తనపై జరిగిన లైంగిక దాడి విషయాలను బయటపెడుతూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

తాజాగా తన బికినీ లుక్ పోస్ట్ చేస్తూ ఓపెన్ అయ్యింది ఐరా ఖాన్. ప్రస్తుతం తాను లోనావాలాలో రిలాక్స్ అవుతున్నానని పేర్కొంది. బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫొటోను, బాత్ ట‌బ్‌లో ప‌డుకొని పుస్త‌కం చ‌దువుతున్న ఫొటోను ఐరా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వ‌ర్క్‌లో జాయిన్ అయ్యే ముందు కాస్త రిలాక్స్ అవుతున్నా అంటూ తన బికినీ లుక్ ను షేర్ చేసింది. ఇదిలా ఉంటే, గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి అతనితో బ్రేకప్ చేసుకున్న ఐరా ఖాన్ ప్రస్తుతం ఆమిర్‌ఖాన్ జిమ్ ట్రైనర్ అయిన నుపూర్ శిఖారెతో డేటింగ్ చేస్తోందనే టాక్ బీ టౌన్ వర్గాల్లో ముదిరింది.