రైల్వే ఫ్లాట్ ఫామ్ మీదనే డ్రైవర్ కు ప్రపోజ్ చేశాడు... ఆమె ఏం చేసిందంటే...
ప్రేమించడం గొప్ప విషయం కాదు. ప్రేమించిన విషయాన్ని ఎక్స్ ప్రెస్ చేయడం గొప్ప. ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని చెప్పేందుకు చాలా మంది భయపడుతుంటారు. చెప్పకుండా మనసులోనే దాచుకొని బాధపడుతుంటారు. తీరా అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక ఫీలైపోతుంటారు. అందుకే నచ్చితే వెంటనే ఎక్స్ ప్రెస్ చేయాలి. ఎక్కడ ప్రపోజ్ చేశామన్నది ముఖ్యం కాదు. అమ్మాయి ఒప్పుకుందా లేదా అన్నది ముఖ్యం. డబ్లిన్ లోని ఓ రైల్వే స్టేషన్ లో కొనొర్ ఒసులీవన్ అనే వ్యక్తి పౌలా కార్బోజియా అనే ట్రైన్ డ్రైవర్ ను ప్రేమించాడు. ఆ విషయాన్ని ఆమెకు చెప్పి పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాడు. రాత్రి 9 గంటల సమయంలో ట్రైన్ నడిపి దిగి వస్తున్నా పౌలాను సర్ప్రైజ్ చేసు బొకే, ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. కొనొర్ ప్రపోజ్ కు తబ్బుబ్బిపోయిన పౌలా ఒకే చెప్పేసింది. విషయం ఏమంటే కొనొర్ కూడా ట్రైన్ డ్రైవర్ కావడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)