టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఐర్లాండ్‌

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఐర్లాండ్‌

డబ్లిన్‌లో భారత్, ఐర్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టీ-20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్‌ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ నాలుగు చేంజెస్ తో బరిలోకి దిగుతుంది. ధావన్, ధోని, భువి, బుమ్రా స్థానాల్లో.. రాహుల్, దినేష్, ఉమేష్, సిద్దార్థ్ లు తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు ఒక చేంజ్ తో ఐర్లాండ్‌ జట్టు  సమరానికి దిగింది. మొదటి టీ-20 మ్యాచ్‌ గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తుంది.

జట్లు:
భారత్‌: కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లి, సురేశ్‌ రైనా, దినేశ్‌ కార్తీక్‌, మనీష్‌ పాండే, హార్ధిక్‌ పాండ్యా, ఉమేశ్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్, సిద్దార్థ్‌ కౌల్‌.

ఐర్లాండ్‌: పాల్‌స్టిర్లింగ్‌, విలియమ్‌ పోర్టర్‌ఫీల్డ్‌, జేమ్స్‌ షెనాన్‌, యాండీ, సిమీసింగ్‌, గారీ విల్సన్‌, కెవిన్‌, స్టువర్ట్‌ థాంప్సన్‌, జియార్జ్‌ డక్‌రెల్, బోయిద్‌ రాన్‌కిన్‌, పీటర్‌చేస్‌.