పాకిస్థాన్ పై కరోనా మరో దెబ్బ...!

పాకిస్థాన్ పై కరోనా మరో దెబ్బ...!

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా జూలైలో పాకిస్తాన్ ఐర్లాండ్ పర్యటన వాయిదా పడింది. కరోనా మహమ్మారి కారణంగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్‌తో జూన్ మరియు జూలైలో జరగాల్సిన ఐర్లాండ్ స్వదేశీ సిరీస్ వాయిదా పడిందని క్రికెట్ ఐర్లాండ్ (సిఐ) బోర్డు తెలిపింది. జూలై 12, 14 తేదీల్లో జరిగే రెండు టీ 20 ఆటలలో ఐర్లాండ్‌తో పాకిస్తాన్ ఆడాల్సి ఉంది. అయితే " ఆటగాళ్ళు, అధికారులు మరియు అభిమానుల భద్రత మొదట వస్తుంది" అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ అన్నారు. అయితే ఇప్పటికే కరోనా పీసీబీ ను ఆర్ధికంగా చాల దెబ్బ తీసింది. అయితే తమ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటం కోసం పాక్ బౌలర్ షోయబ్ అక్తర్ భారత్-పాక్ మధ్య మ్యాచ్ నిర్వహించాలని అన్నాడు. అయితే దానికి బీసీసీఐ వద్ద నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇపుడు ఐర్లాండ్ పర్యటన ఈ సమయం లో రద్దు కావడం తో పీసీబీకి  గట్టి దెబ్బ అనే చెప్పాలి.