ఐర్లాండ్ విజయలక్ష్యం 214

ఐర్లాండ్ విజయలక్ష్యం 214

డబ్లిన్‌లో భారత్, ఐర్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టీ-20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు దుమ్ములేపింది.ఈ రెండవ టీ-20లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఓపెనర్ లోకేష్ రాహుల్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నాడు. ఇన్నింగ్స్ మొదట నుంచి బౌండరీలే లక్ష్యంగా ఆడిన రాహుల్(70; 36 బంతుల్లో 3x4, 6x6)పరుగులతో చెలరేగాడు. రాహుల్ తో పాటు సురేష్ రైనా(69; 45 బంతుల్లో 5x4, 3x6)కూడా ధాటిగా ఆడారు. ఇక చివర్లో హార్ధిక్(32; 9 బంతుల్లో  1x4, 4x6), మనీష్(21)లు పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓబ్రెయిన్‌ మూడు వికెట్లు తీశాడు. ఐర్లాండ్ విజయలక్ష్యం 214 పరుగులు.