ప్రాక్టీస్ మొదలెట్టిన ధోని, కోహ్లీ

ప్రాక్టీస్ మొదలెట్టిన ధోని, కోహ్లీ

ఐర్లాండ్‌తో జరగబోయే టీ-20 సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఐర్లాండ్‌ క్యాపిటల్ డబ్లిన్‌లోని ద విలేజ్ స్టేడియంలో బుధవారం ఐర్లాండ్‌, భారత్ జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మాజీ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, జట్టులోకి పురాగమనం చేసిన సురేష్ రైనా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సిరీస్ లో భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ-20లు ఆడనుంది. బుధవారం తొలి టీ-20 మ్యాచ్, శుక్రవారం రెండవ టీ-20 మ్యాచ్ లు ఉన్నాయి. ఈ సిరీస్ లో భారత జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.