కోహ్లీ 100 శతకాలు...?

కోహ్లీ 100 శతకాలు...?

ఇప్పటివరకు క్రికెట్ లో చాల రికార్డులు సృష్టిస్తూ వచ్చాడు లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్. అయితే ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ వస్తున్నాడు ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. అదే తరహాలో సచిన్ నెలకొల్పిన మరో రికార్డు వైపుగా దూసుకస్తునాడు విరాట్. అదేంటంటే 100 శతకాలు. ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో ఆ రికార్డు సాధించిన ఏకైక ఆటగాడు సచిన్. అయితే ఇప్పటికే వన్డే, టెస్టుల్లో కలిపి 70 సెంచరీలు నమోదు చేసాడు విరాట్ కోహ్లీ.

 అయితే ఈ సీషయం పై భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... సచిన్ టెండూల్కర్ సాధించిన 100 శతకాల్లో.. 49 సెంచరీలు వన్డేల్లో... 51 శతకాలు టెస్టుల్లో బాదాడు. అయితే.. విరాట్ కోహ్లీ ఇప్పటికే వన్డేల్లో 43 శతకాలు పూర్తి చేసి సచిన్ రికార్డ్‌కి చేరువకాగా.. టెస్టుల్లో మాత్రం 27 శతకాలు మాత్రమే బాదాడు. కాబట్టి వన్డేల్లో సెంచరీ రికార్డ్‌ని బ్రేక్ చేయడం కోహ్లీకి సాధ్యమే. కానీ.. 100 సెంచరీల రికార్డ్‌ని బ్రేక్ చేయడం మాత్రం కష్టం. కానీ సచిన్ మాదిరిగా కోహ్లీ కూడా తన కెరియర్ ను నడిపిస్తే 100 సెంచరీలు నమోదు చేయగలడని పఠాన్ చెప్పుకొచ్చాడు. అయితే చూడాలి మరి విరాట్ ఆ మార్క్ చేరుకుంటాడా... లేదా అనేది.