వెండితెరపై ప్రముఖ క్రికెటర్లు..

వెండితెరపై ప్రముఖ క్రికెటర్లు..

టీమిండియా తరపున ఓ వెలుగు వెలిగిన ప్రముఖ క్రికెటర్లు ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.. ఒకరు స్పిన్‌తో ఆకట్టుకుంటే.. మరొకరు ఫాస్ట్ బౌలింగ్‌తో టీమిండియాకు మంచి విజయాలను అందించడంతో పాటు.. అభిమానులు కట్టిపడేశారు. ఆ ఇద్దరు క్రికెట్ గ్రౌండ్ హీరోలు ఇప్పుడు.. వెండితెర మైదానంలో అగుడు పెట్టనున్నారు. వారే మన ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్‌. ఈ ఇద్దరు క్రికెటర్లు ఇప్పుడు కోలీవుడ్‌ సినిమాలతో తెరగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. 

తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో నటించనున్నాడు పఠాన్.. తమిళస్టార్ హీరో విక్రమ్ ఈ మూవీలో ఇర్ఫాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన ఇర్పాన్.. తాను కొత్త వెంచర్‌లో కొత్త సవాళ్ల కోసం ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశాడు. మరోవైపు కార్తీక్ యోగి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డిక్కీలూనా’ సినిమాలో హర్భజన్ సింగ్ నటించనున్నారు. తాను తమిళ సినిమాతో పరిచయమవుతున్నట్లు హర్భజన్ సింగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా, ఈ ఇద్దరు క్రికెటర్లు టీమిండియాకు దూరమయ్యారు.. పఠాన్ 2012 నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడడం లేదు.. ఇక, భజ్జీ 2016లో చివరిసారి టీమిండియా తరపున ఆడాడు... అయితే, ఐపీఎల్‌లో మాత్రం హర్భజన్ సింగ్ సత్తా చాటుతూనే ఉన్నాడు. ఇక మైదానాన్ని విడిచి.. వెండితెరపైకి వెళ్తున్న క్రికెట్ హీరోలు.. ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడాలి.