కరీబియన్ ప్రిమియర్ లీగ్‌కు ఇర్ఫాన్ పఠాన్

కరీబియన్ ప్రిమియర్ లీగ్‌కు ఇర్ఫాన్ పఠాన్

భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ సరికొత్త రికార్డు నెలకొల్పనున్నాడు. ఈ సీజన్ కరీబియన్ ప్రిమియర్ లీగ్ లో పఠాన్ ఆడేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఏ జట్టు యాజమాన్యం అయినా సరే పఠాన్‌ను తీసుకుంటే కరీబియన్‌ లీగ్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి భారత ఆటగాడుగా ఇర్ఫాన్‌ చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకూ భారత్‌ నుంచి ఏ ఆటగాడు ఈ లీగ్‌లో ఆడలేదు. గురువారం ప్రకటించిన సీపీఎల్‌ ఆటగాళ్ల జాబితాలో ఇర్ఫాన్‌ పఠాన్‌ చోటు దక్కించుకున్నాడు. పఠాన్‌తో పాటు ఈ లీగ్‌లో ఆడేందుకు ఇంగ్లాండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌, ఐపీఎల్‌ స్టార్స్‌ రషీద్‌ఖాన్‌, షకిబుల్‌ హాసన్‌, జొఫ్రా ఆర్చర్‌, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జేపీ డుమినీ కూడా తమ పేర్లను సమర్పించారు. సెప్టెంబర్‌ 4 నుంచి అక్టోబర్‌ 12 వరకూ జరగనున్న ఈ లీగ్‌లో ఆడేందుకు ఇప్పటికే 536 మంది విదేశీ ఆటగాళ్లు దరఖాస్తులు చేసుకున్నారని సీపీఎల్‌ తన అధికారిక వెబ్‌సైట్లో తెలిపింది.