ఆచార్య టీజర్ వచ్చేది అప్పుడేనా?

ఆచార్య టీజర్ వచ్చేది అప్పుడేనా?

తెలుగు చిత్ర సీమలో ఎదురులేని రారాజుగా ఎదిగిన హీరో చిరంజీవి. దాదాపు దశాబ్ద కాలం పాటు అగ్ర హీరోగా రాణించాడు. ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశంతో సినిమాలకు చాలా కాలం దూరమయిన చిరు మళ్లీ ఖైధీ నెం150తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. లేటుగా వచ్చినా లేటెస్ట్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం చిరు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను రూపొందిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఇందులో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. దాదాపు నలభై నిమిషాల నిడివి ఉన్న పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. అయితే ప్రస్తుతం మెగా అభిమానులు ఎదురుచూస్తున్న ఏకైక విషయం ఆచార్య టీజర్. ఈ సినిమా టీజర్ విడుదల ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఉవ్విళూరుతున్నారు. అయితే ఎట్టకేలకు దీనిపై ఓ తాజా అప్‌డేట్ వచ్చేసింది. ఈ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ వచ్చే సమయం ఆసన్నమయింది. గణతంత్ర దినోత్సవ సందర్బంగా ఈ సినిమా టీజర్‌ను జనవరీ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాలో తమ అభిమాన హీరో చిరు ఎలా కనిపిస్తాడా అని అభిమానులు వేచి చూస్తున్నారు.