అల్లూరిని రివీల్ చేస్తారా?

అల్లూరిని రివీల్ చేస్తారా?

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  సినిమాకు బ్రేక్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నారు.  అయితే, సడెన్ గా రాజమౌళి తన వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా వెళ్లారు.  దీంతో తాత్కాలికంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. రాజమౌళి తిరిగి వచ్చిన వెంటనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది.  

ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు.  ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి.  ఈ సందర్భంగా యూనిట్ ఓ అప్డేట్ ను బయటకు రిలీజ్ చేసింది.  అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా చరణ్ కు సంబంధించిన లుక్ ఏదైనా రివీల్ చెయ్యొచ్చని చెప్తోంది.  ఇప్పటివరకైతే ఎలాంటి లుక్ రిలీజ్ చేయలేదు.  కాగా, స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.