#RRR కు బాహుబలి తరహా ప్లాన్..!!

#RRR కు బాహుబలి తరహా ప్లాన్..!!

ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది.  ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు పాల్గొన్నారు.  వీరిద్దరి మధ్య ఫైట్ సీన్స్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు.  రాజమౌళి ప్రస్తుతం తన కుమారుడు కార్తికేయ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.  రామ్ చరణ్ కూడా వినయ విధేయ రామ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ లో బిజీ అయ్యారు.  జనవరిలో సెకండ్ షెడ్యూల్ ఉండబోతున్నది.  ఈ సినిమాకు సంబంధించిన పూర్తి క్యాస్టింగ్ ను ఇంతవరకు ప్రకటించలేదు.  

ఇదిలా ఉంటె, ఆర్ఆర్ఆర్ గురించిన ఓ న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.  దాదాపు రూ.300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాను ఒక్క పార్ట్ తో కాకుండా రెండు భాగాలుగా చిత్రీకరిస్తే.. బాగుందనే ఆలోచన రాజమౌళి మనసులో కలిగిందని, అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ ను ఇప్పటి వరకు లాక్ చేయలేదని సమాచారం.  బాహుబలి సినిమా మాదిరిగానే ఫస్ట్ పార్ట్ లో కొన్ని ప్రశ్నలకు సంధించి వదిలేస్తారని.. వాటికి సమాధానాలను సెకండ్ పార్ట్ లో చూపిస్తారని.. ఇలా చేయడం వలనే బాహుబలి 2కి భారీ వసూళ్లు వచ్చాయి.  ఇదే ఫార్ములాను ఆర్ఆర్ఆర్ మూవీకి కూడా అప్లై చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.