బోయపాటిని బాలయ్య పట్టించుకోవట్లేదా ?

బోయపాటిని బాలయ్య పట్టించుకోవట్లేదా ?

బాలయ్య కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు 'సింహ' లాంటి హిట్ ఇచ్చి ఆయన్ను ట్రాక్లోకి తెచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను.  ఆ తరవాత కూడా బోయపాటి 'లెజెండ్' రూపంలో బాలయ్యకు ఇంకో హిట్ ఇచ్చాడు.  అలాంటి దర్శకుడికి ఇప్పుడు బాలయ్యతో సినిమాను సెట్ చేసుకోవడం కష్టంగా ఉంది. 

'వినయ విధేయ రామ' సినిమా విడుదలకు ముందు బోయపాటితో బాలయ్య సినిమా ప్రకటన జరిగింది.  ఇంకో నెలలో సినిమా స్టార్ట్ అవుతుందన్న హడావుడి జరిగింది.  కానీ వివిఆర్ విడుదలై డిజాస్టర్ అయిన తరవాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కష్టమైపోయింది.  బాలయ్య కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.  దీంతో బోయపాటి డైలమాలో పడ్డారు.