చరణ్ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడా?

చరణ్ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడా?

రామ్ చరణ్‌ దృష్టి మరోసారి ద్విపాత్రాభినయంపై పడిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తో చెర్రీ 15వ సినిమాగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్న సినిమాలో చరణ్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు వినిపిస్తోంది. ఇందులో యంగ్ క్యారెక్టర్ తో పాటు చరణ్ వయసు మళ్ళిన వృద్ధుడి పాత్రలో నటిస్తాడట. గతంలో చెర్రీ వివి వినాయక్ దర్శకత్వంలో 'నాయక్' సినిమాలో డ్యూయెల్ రోల్ చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని సాధించింది. అయితే అందులో రెండు పాత్రలూ యంగ్ వే. ఇప్పుడు చరణ్‌ ఏజ్ డ్ పాత్ర పోషిస్తే అది ఛాలెంజ్ తో కూడిన వ్యవహారం అవుతుంది. ఈ విషయమై దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. శంకర్ కి ద్విపాత్రాభినయం తో కూడిన సినిమాలు కొట్టిన పిండే. 'భారతీయుడు', 'జీన్స్' వంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం తాలూకు వేరియన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఇక ఇది దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. దీనికి హై బడ్జెట్ కూడా కేటాయిస్తున్నాడట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేయనున్నట్లు టాక్. మరి చరణ్ ద్విపాత్రాభినయం చేస్తాడా? లేక వృద్ధుడి పాత్రకు మరో స్టార్ హీరోను రంగంలోకి దించుతారా? అన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.