ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్?

ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చార వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడతంటో కుదిరినంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. అయితే ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపింనున్నాడన్న విషయం తెలిసిందే. ఈ పాత్రను చాలా ఎమోషనల్‌గా పరిచయం చేయనున్నారట. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో చరణ్‌కి కూడా జోడీ ఉంది. కానీ అది ఎవరనేది ఇంకా తేలలేదు. ఇటీవల ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని వార్తల ప్రకారం అర్థం అవుతోంది. అంతేకాకుండా ఈ డేట్ చిరుకు చాలా సెంటిమెంట్ కూడా చిరు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ సినిమాలు ఇదే తారీకున విడుదలయ్యాయి. అవి ఎంతపెద్ద హిట్ అయ్యాయో తెలిసిన విషయమే. దాంతో ఆచార్యను అదే తారీకున విడుదల చేస్తారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం దాగి ఉందో తెలియాల్సి ఉంది.