మజిలీపై చిత్రలహరి ఎఫెక్ట్ ఎంత..!!

మజిలీపై చిత్రలహరి ఎఫెక్ట్ ఎంత..!!

ఏప్రిల్ 5 వ తేదీన రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మజిలీ సినిమా ఎన్నికల సమయంలోను దూసుకుపోతున్నది.  ఎలక్షన్స్ జరిగిన 11 వతేదీన నైజాం ఏరియాలో ఏకంగా రూ.1.1 కోట్లు వసూలు చేసింది.  ఎలక్షన్స్ సమయంలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం గొప్ప విషయమే.  ఇప్పటి వరకు దాదాపుగా ఈ సినిమా రూ.25 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.  

ఇదిలా ఉంటె, ఈరోజు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి రిలీజ్ అయ్యింది.  భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రలహరి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను అందుకోవడంతో... మజిలీపై ఎఫెక్ట్ పడే అవకాశలు తక్కువే అని చెప్పాలి.  మజిలీ సినిమాకు ఇది కలిసొచ్చే అంశం అని చెప్పచ్చు.  ఇప్పటికే మజిలీ ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది.