బిగ్ బాస్ : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా ..?

బిగ్ బాస్ : ఈ వారం ఎలిమినేట్  అయ్యేది ఆమేనా ..?

బిగ్ బాస్ సీజన్ 4 మొదలైన దగ్గరనుంచి కొన్ని విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సారి చాలా వరకు తెలియని మొహాలను హౌస్ లోకి తీసుకు రావడంతో అందరిలో ఆసక్తి తగ్గింది . అయితే కేవలం గంగవ్వ కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో ఎలిమినేషన్ కు సంబంధించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.అయితే కొత్తగా వచ్చిన కుమార్ సాయి హౌస్ నుంచి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు . అయితే నిన్నటి లీక్ ప్రకారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.. తాజాగా అది నిజం కాదని ఈ వారం హౌస్ నుంచి వెళ్ళేది దేవీ నాగవల్లి అని  తెలుస్తుంది. గత వారం అంతకు ముందు వారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగా సూర్య కిరణ్ మరియు కరాటే కళ్యాణిలు ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది. అందరు అనుకుంటున్నట్టు దేవీ ఎలిమినేట్ అవుతుందేమో చూడాలి.