విలన్ పాత్రలో త్రివిక్రమ్..

విలన్ పాత్రలో త్రివిక్రమ్..

త్రివిక్రమ్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు.. రాస్తూపోతే.. కాగితాలు చాలవు.. మెదడులో ఉన్న గుజ్జు సరిపోదు.. ఒక్క మాటలలో చెప్పాలంటే ఈయన మాటల మాంత్రికుడు.. మ్యాజిక్ చేసే దర్శకుడు.  పంచ్ డైలాగులతో ప్రేక్షకులకు కితకితలు పెట్టిస్తూనే.. పదునైన కరుణ రసాన్ని  సున్నితంగా చెప్పగల సమర్ధుడు త్రివిక్రమ్. 

త్రివిక్రమ్ సినిమాలకు ప్రేక్షకులు ఎందుకు చూస్తారు అనడానికి ఇవే ఉదాహరణలు.  అయన డైలాగుల కోసమే సినిమాకు వెళ్తారు.  అజ్ఞాతవాసి సినిమా తరువాత త్రివిక్రమ్ పై విమర్శకు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఇటీవలే రిలీజ్ అయింది.  ఎలాగైనా హిట్ కొట్టాలనే తపన ఈ టీజర్ లో కనిపించింది.  

ఇదిలా ఉంటె, త్రివిక్రమ్ కు సంబంధించిన ఓ ఫోటోను బ్రహ్మాజీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.  అందులో త్రివిక్రమ్ హుడ్ క్యాప్ తో రఫ్ గడ్డంతో ఉన్నాడు. వేలితో గడ్డాన్ని రఫ్ చేస్తున్నట్టుగా ఉంటుంది.  చూడటానికి అచ్చు తెలుగు సినిమాలో విలన్ ఉన్నట్టుగా ఉన్నాడు.  "వస్తున్నా.. బీ రెడీ" అనే కాప్షన్ ఇచ్చాడు బ్రహ్మాజీ.  అంటే అవకాశం వస్తే త్రివిక్రమ్ సినిమాలో విలన్ రోల్ ప్లే చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పే విధంగా ఉన్నది.  

 

 

Am on my way...be ready..#Trivikram

A post shared by Brahmaji Actor (@brahms25) on