బెంగాల్ ఎన్నికలపై రైతుల ఉద్యమం ప్రభావం? 

బెంగాల్ ఎన్నికలపై రైతుల ఉద్యమం ప్రభావం? 

ఈ ఏడాది బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.  ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తృణమూల్, బీజీపీలు చూస్తున్నాయి.  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు కూడా జరుగుతున్నాయి.  అయితే, ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమం ప్రభావం బెంగాల్ ఎన్నికలపై ఏ మేరకు ఉంటుంది అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉన్నది.  ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల నుంచి సపోర్ట్ వస్తున్నది.  జనవరి 26 ఎర్రకోట ఘటన తరువాత కొంతమంది రైతులు వెనక్కి తగ్గారు.  కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ శివారుకు చేరుకుంటున్నారు.  బెంగాల్ ప్రభుత్వం కూడా రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించినా బెంగాల్ రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నట్టుగా కనిపించడం లేదు.  బెంగాల్ ఎన్నికల సమయంలో సీఎం మమత బెనర్జీ రైతుల ఉద్యమంపై స్పందించే విధానం బట్టి దాని ప్రభావం బెంగాల్ పై ఉండే అవకాశం ఉంటుంది.  ఒకవేళ బెంగాల్ లో కూడా రైతులు ఉద్యమం మొదలుపెడితే, అది బీజేపీకి కొంత ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది.