ఈ యంగ్ హీరో స్మాల్ స్కేల్ ఫిల్మ్స్‌ని పక్కనపెట్టేశాడా.. ?
దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ ఆ తర్వాత మీడియం రేంజ్ సినిమాలతోనే మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎనర్జిటిక్ స్టార్‌గా ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నాడు. ఇక 'ఇస్మార్ట్ శంకర్'తో ఈ హీరోకి మాస్ ఇమేజ్ కూడా వచ్చేసింది. ఈ ఇమేజ్‌తోనే రామ్‌లో చాలా మార్పులొచ్చాయి అంటున్నారు జనాలు. ఈ మార్పులతోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్చెయ్యకుండా కూర్చున్నాడని ప్రచారం జరుగుతోంది. రామ్ మీడియం రేంజ్ అనే మాటనే పక్కనపెట్టేస్తున్నాడట. 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ అయ్యాక కూడా చిన్న సినిమాల చుట్టూ తిరగడం ఎందుకు, రేంజ్ పెంచే సినిమాలు చేద్దాం అనుకుంటున్నాడట. అందుకే 'రెడ్' తర్వాత వచ్చిన చిన్న దర్శకులు, స్మాల్ స్కేల్ ఫిల్మ్స్‌ని పక్కనపెట్టేశాడట. లార్జ్ స్కేల్ ఫిల్మ్స్ మాత్రమే ఓకే చేస్తా అంటున్నాడట రామ్. రామ్ నెక్ట్స్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా జూ.ఎన్టీఆర్ డెసిషన్‌పై ఆధారపడి ఉందని ఇండస్ట్రీ టాక్. తారక్ 'ట్రిపుల్ ఆర్' నుంచి ఫ్రీ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది అనుకుంటేనే త్రివిక్రమ్ మరో మూవీ చేస్తాడు. లేదంటే జూ.ఎన్టీఆర్ సినిమానే ఉంటుందని చెప్తున్నారు. మరి రామ్ పెద్ద సినిమా ప్లాన్స్‌ని డైరెక్ట్ చేసేదెవరో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)